Homeహైదరాబాద్‌CSIR-IICT | మధుమేహ పాదగాయాలకు మొక్కల ఔషధం

CSIR-IICT | మధుమేహ పాదగాయాలకు మొక్కల ఔషధం

  • సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ సరికొత్త ఆవిష్కరణ

మధుమేహ పాదగాయాల చికిత్సకు జిమ్నీమా సిల్వెస్ట్రే ఔషధ మొక్క ఆధారంగా సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ అభివృద్ధి చేసిన ఫైటోఫార్మాస్యూటికల్‌ ఔషధం కీలక దశకు చేరింది.ఈ సందర్భంగా సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ నాలెడ్జ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ చైర్‌,బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ శాస్త్రవేత్త జి.డాక్టర్‌ ఎస్‌.రామమోహన్‌ మాట్లాడుతూ,దేశీయ సంప్రదాయ వృక్ష వనరులను శాస్త్రీయంగా ధ్రువీకరించి,ఆధునిక చికిత్సా విధానాలకు అనుసంధానం చేయడం ఎంతో ప్రాధాన్యమన్నారు. ఈ సాంకేతికతను విరిడిస్‌ బయోఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఒప్పందం కుదిరింది. ఔషధం IND-ready స్థాయికి చేరినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సంప్రదాయ వృక్ష సంపదను ఆధునిక శాస్త్రీయ పరిశోధనతో అనుసంధానించి ఆధారబద్ధమైన చికిత్సా ఉత్పత్తిగా అభివృద్ధి చేయడంలో ఈ ఒప్పందం కీలక ముందడుగని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News