ఈ రోజుల్లో నిజం మాట్లాడితే.. అది ‘నెగటివిటీ’గా ట్రెండ్ అవుతోంది.. అబద్ధం చెప్పేవాడు ‘పాజిటివ్ వైబ్స్’ గురవుతున్నాడు.. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలే సైలెంట్ మోడ్లో పెట్టబడ్డారు.. ప్రశ్న అడిగితే దేశద్రోహం ట్యాగ్ రెడీగా ఉంది.. పేదల సమస్యలు ఎన్నికల సీజన్లో మాత్రమే ఆన్లైన్ అవుతాయి.. అభివృద్ధి అనే మాట హోర్డింగ్స్ మీద పెద్దగా కనిపిస్తుంది.. గ్రౌండ్లో మాత్రం చిన్నదైపోతుంది.. సోషల్ మీడియాలో దేశభక్తి డేటా ప్యాక్ ఉన్నంతవరకే నిలుస్తోంది.. నిజమైన సమస్యలపై చర్చ కంటే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లో ముఖ్యమైపోయాయి.. మాటల యుద్ధంలో గెలుస్తున్నవాళ్లు జీవిత యుద్ధంలో ఓడిపోతున్నారన్న నిజం ఎవరూ చూడట్లేదు? నాయకుల మాటల్లో భవిష్యత్తు మెరిసిపోతుంటే ప్రజల కళ్లలో మాత్రం వర్తమానం మసకబారుతోంది.. ప్రశ్నించే స్వరాలు తగ్గిపోతే అబద్దపు ప్రచారాలే నిజాలుగా చెలామణి అవుతాయి.
- ఖాన్ సాబ్
