నేటి పోటీ ప్రపంచంలో ఇంకా ఇంకా సంపాదించాలనే ఆరాటంలో మనిషి తన దగ్గర ఉన్న వాటిని వదిలేసి,లేని వాటి కోసం పరుగులు తీస్తున్నాడు. సామాన్యుడైన..మాన్యుడైనా స్వార్థపు పొరలు కమ్ముకుని,ఎప్పటికీ తీరని తపనతో సంతృప్తికి దూరమవుతున్నాడు.ఆనందం.. సంతోషం సంపదలో కాదు, సంతృప్తిలోనే ఉన్నాయి. అయితే నూతిలో కప్పలా అదే లోకమని భావించి జీవించకూడదు,సంఘజీవన బాధ్యతను మరవ కూడదు. పరోపకారమే జీవిత పరమార్థం. సక్రమార్జనలోనే నిజమైన సంతృప్తి.. సంతృప్తిలోనే శాశ్వత సుఖం ఉంది. మనిషి ఏడుస్తూ పుట్టాడంటే! అందరినీ ఏడిపించడానికి కాదు కదా! నిరాపేక్షతో చేసే మేలులోనే నిజమైన ఆనందం ఉంది. చివరికి మన వెంట వచ్చేది సంపద కాదు.. మనం చేసిన మంచే!
- మేదాజీ
- Advertisement -
