Homeనల్లగొండBreastfeeding | తల్లిపాలే శిశువుకు తొలి టీకా..

Breastfeeding | తల్లిపాలే శిశువుకు తొలి టీకా..

  • సూర్యాపేట జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షుడు గుండు రామాంజి గౌడ్

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు–1, 2లో గురువారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, “తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. ఆరోగ్యానికి తొలి రక్షణ” అని అన్నారు. ప్రతి తల్లి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని, మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలనే అందించాలని సూచించారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే అమూల్యమైన ఆహారమని పేర్కొన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించి వాటిని ప్రోత్సహించాలని, తద్వారా ఆరోగ్యవంతమైన బంగారు భవిష్యత్తును నిర్మించవచ్చని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సునీత, అంగన్‌వాడీ టీచర్లు చంద్రకళ, నాగమణి, అంగన్‌వాడీ ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News