Homeనల్లగొండCheyutha Pension | అర్హులందరికీ చేయూత పెన్షన్ల పంపిణీ...

Cheyutha Pension | అర్హులందరికీ చేయూత పెన్షన్ల పంపిణీ…

మేళ్లచెరువు మండల పరిధిలోని రేవూరు గ్రామ పంచాయతీలో గురువారం (Cheyutha Pension) చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జూనబోయిన గురవయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు మంజూరైన పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గురవయ్య మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర భారీ నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఓరుగంటి దుర్గా భవాని,వార్డు సభ్యులు వెంకట్రావు, నాగలక్ష్మి, రామ కోటమ్మ, విజయకుమార్, కృష్ణ,నరసింహ, పంచాయతీ కార్యదర్శి పచ్చి పాల వెంకటేశ్వర్లు,పెన్షన్ లబ్ధిదారులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News