- మలయాళ మెగాస్టార్ మమ్ముటితో కలిసి నటించే అవకాశం..Renu Desai
- ఆయనతో ఒక ఫోటో దిగితే చాలనుకున్నాను : రేణు దేశాయ్..
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ (Renu Desai ) చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓం’ చిత్రంతో ఆమె నటిగా పునరాగమనం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఈ అవకాశం ఎలా వచ్చింది, తన ఆరోగ్య రహస్యం ఏంటి అనే విషయాలపై ఆసక్తికరమైన వివరాలు పంచుకున్నారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం రావడం తనను ఆశ్చర్యపరిచిందని రేణూ దేశాయ్ అన్నారు.
“గతేడాది ఆయన సినిమాలు చూస్తూ, ఎప్పటికైనా ఆయన్ను కలిసి ఒక ఫొటో దిగితే చాలనుకున్నాను. కానీ ఆయన సరసన నటించే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు” అని తెలిపారు. మహాశివరాత్రి రోజున తాను కామాఖ్య దేవాలయంలో ఉన్నప్పుడు చెన్నై నుంచి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి మమ్ముట్టి సినిమాలో భార్య పాత్రకు ఆఫర్ చేశారని చెప్పారు. మొదట దాన్ని ఒక ప్రాంక్ కాల్ అనుకుని నమ్మలేకపోయానని ఆమె గుర్తుచేసుకున్నారు. రెండు నెలల తర్వాత చిత్రానికి ‘ఓం’ అని పేరు ప్రకటించగానే తనకు గూస్బంప్స్ వచ్చాయని, ఇదంతా దైవ సంకల్పమేనని భావిస్తున్నానని అన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
