- నిబంధనలు బేఖాతర్..liquor permit room
- యథేచ్ఛగా అదనపు వసూళ్లు..?
- చాకలి ఐలమ్మ సాక్షిగా సాగుతున్న అక్రమ దందా..liquor permit room
- అధికారుల పర్యవేక్షణ ఏదీ…?
- 90 ఎం.ఎల్. మద్యం సీసాపై రూ.20 అదనంగా వసూలు చేస్తున్న వైనం!
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆర్ఆర్ఆర్ వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్లో ఉదయం 8 గంటల నుంచే మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (liquor permit room) మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పక్కనపెట్టి, ఉదయాన్నే పర్మిట్ రూమ్ తెరిచి మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు 90 ఎం.ఎల్. మద్యం సీసాపై నిర్ణీత ధరకు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో సీసాపై ఇంత మొత్తంలో అదనపు వసూళ్లు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎక్సైజ్ శాఖ అధికారులకు కనిపించడం లేదా….?
పట్టణంలో మద్యం విక్రయాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఉదయం నుంచి పర్మిట్ రూమ్ నిర్వహణ మధ్య సమయాలు అదనపు వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆర్ ఆర్ ఆర్ వైన్స్ పక్కన జరుగుతున్న వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు స్పందిస్తారా..? చూసి చూడనట్టు వ్యవహారిస్తారా అనేది వేచి చూడాలి…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
