Homeఆంధ్రప్రదేశ్Y. S. Avinash Reddy | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..

Y. S. Avinash Reddy | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..

  • ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై దాడి..Y. S. Avinash Reddy
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్..

కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలం అంకలమ్మ గూడూరు సమీపంలో ఈ ఉదయం వైసీపీ ఎంపీ (Y. S. Avinash Reddy) వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రత్యర్థులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో కాన్వాయ్‌పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఎంపీ కాన్వాయ్‌లోని ఒక వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత బీటెక్ రవినే తమపై ఈ దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. “కేవలం ఐదు వాహనాలతోనే వెళ్లా. సీఐ, ఎస్‌ఐకు సమాచారం ఇచ్చా. బీటెక్‌ రవి ఆధ్వర్యంలోనే దాడులు చేశారు. పెట్రోల్‌ బాంబులతో దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News