చింతలపాలెం మండల పరిధిలోని అడ్లూరు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం (TB Screening Drive) క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఐ. ఆండాళు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ పర్సన్, హెల్త్ సూపర్వైజర్ సీహెచ్. రాజ్‌కుమార్ పర్యవేక్షణలో 18 మంది టీబీ వ్యాధి అనుమానితుల నుంచి కళ్లె నమూనాలను సేకరించారు.
సేకరించిన నమూనాలను మేళ్లచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ టెక్నీషియన్‌కు అందజేశారు. అక్కడి నుంచి సూర్యాపేట టీ-హబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో టీబీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి ఆరు నెలలపాటు ఉచితంగా మందులు అందించి, వ్యాధి నుంచి కోలుకునేలా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీహెచ్.అఖిల (ఎంఎల్‌హెచ్‌పీ), కే.స్వరూప (ఏఎన్‌ఎం),ఆశా కార్యకర్తలు మల్లేశ్వరి, నాగజ్యోతి, సలోమి, తేజస్విని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
