Homeరంగారెడ్డిAliabad | ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Aliabad | ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం చేసిన ఉద్యమం, ఆయన ఆలోచనలు, త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఎ. వెంకటేశం, మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News