- సమతూకంగా మారిన జట్టు..Hardik Pandya
- వెల్లడించిన రికీ పాంటింగ్..
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) రాకతో ఐపీఎల్ 2027 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టు సమతూకంగా మారిందని ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. వేలానికి ముందే ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఇచ్చి, భారీ ట్రేడింగ్ ద్వారా హార్దిక్‌ను పంజాబ్ తమ గూటికి చేర్చుకుంది. పేస్, స్పిన్ విభాగాల్లో నాణ్యమైన ఆల్‌రౌండర్ల బలం తమకు కలిసొచ్చే అంశమని పాంటింగ్ తెలిపాడు.
రాబోయే సీజన్ కోసం తాము కేవలం ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే విడుదల చేసి, 19 మందిని రీటైన్ చేసుకున్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. “హార్దిక్ రాకతో పాటు ఇప్పటికే జట్టులో ఉన్న మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా, శశాంక్, సూర్యాంశ్ షెడ్గే, కూపర్ కానోలీ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ విభాగాల్లో అవసరమైన అన్ని స్థానాలను భర్తీ చేసుకున్నాం. డిసెంబరు 16న గోవాలో జరిగే వేలంలో మా ప్రధాన లక్ష్యం తుది జట్టును మరింత పటిష్ఠం చేసుకోవడమే. ఆ తర్వాత భవిష్యత్తు కోసం ప్రతిభావంతులైన యువ భారత ఆటగాళ్లను ఎంపిక చేయడంపై దృష్టి పెడతాం” అని పాంటింగ్ తెలిపాడు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
