Tuesday, June 9, 2026
Homeకరీంనగర్Kasi Satram | కాశీ క్షేత్రంలో ఆర్యవైశ్య నిత్యన్న సత్రం నిర్మాణం

Kasi Satram | కాశీ క్షేత్రంలో ఆర్యవైశ్య నిత్యన్న సత్రం నిర్మాణం

  • జిల్లా నుంచి భాగమై.. సహకారం అందించాలి..
  • ఆర్యవైశ్య నిత్యన్న సత్రం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్

పవిత్ర కాశీ క్షేత్రంలో వేములవాడ ఆర్యవైశ్య సత్రం ఆధ్వర్యంలో వేములవాడ ఆర్యవైశ్య నిత్యన్న సత్రం నిర్మాణం జరుగుతోందని కాశీ ఆర్యవైశ్య నిత్యన్న సత్రం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు గర్వకారణమైన ఈ మహత్తర సేవా కార్యక్రమంలో భాగంగా, కాశీలో స్వంతంగా కొనుగోలు చేసిన స్థలంలో సుమారు ఏడు అంతస్తుల భవనాన్ని, దాదాపు 45 ఏసీ గదులతో నిర్మిస్తున్నామని వివరించారు. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే వేములవాడ సత్రం ద్వారా సుమారు రూ. 5 కోట్లతో స్థలాన్ని కొనుగోలు చేసి, మరో రూ. 6 కోట్లతో భవన నిర్మాణం చేపట్టి, మొత్తం రూ. 11 కోట్ల వ్యయంతో ఈ సత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.

ఈ సత్రం ప్రారంభోత్సవం ఆగస్టు నెలలో నిర్వహించ బడుతుందని, దేశ నలుమూలల నుండి కాశీకి వచ్చే భక్తులకు వసతి, నిత్యాన్నదానంవంటి సేవలు అందించేందుకు ఈ సత్రం ఎంతో ఉపయోగపడనుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, నిత్యాన్నదానానికి, సత్ర నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహకారం అందించాలని కోరారు.

- Advertisement -

త్వరలో సత్రం ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆర్యవైశ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి, సత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బ్రోచర్‌ను అందజేసి మీ సహకారాన్ని అభ్యర్థిస్తారని తెలిపారు. కాశీ క్షేత్రంలో ఆర్యవైశ్య సమాజానికి శాశ్వత సేవా కేంద్రంగా నిలిచే ఈ సత్ర నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News