వికారాబాద్ జిల్లాలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా, డిఎం అండ్ హెచ్ వో గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పవిత్ర(Dr. Pavitra) రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వోగా బదిలీపై నియమితులయ్యారు. ప్రస్తుతం సిరిసిల్లలో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా, ఇన్చార్జి డిఎంహెచ్వో గా పనిచేస్తున్న డాక్టర్ రజిని హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు.
బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో డాక్టర్ పవిత్ర బుధవారం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజారోగ్య సేవల మెరుగుదల, వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలుపై చర్చించినట్లు సమాచారం. వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ పవిత్ర సిరిసిల్ల జిల్లాలో ఆరోగ్య సేవల అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నియామకంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగనున్నాయని భావిస్తున్నారు.
