Homeబిజినెస్Gold | తగ్గిన గోల్డ్ రేట్స్..

Gold | తగ్గిన గోల్డ్ రేట్స్..

  • విక్రయాలు అధికమవడంతో పడిపోతున్న ధరలు..

బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరగడం, మరోవైపు క్రూడాయిల్‌ ధరలు భగ్గుమనడంతో పెట్టుబడిదారులు విలువైన లోహాలను విక్రయించడానికి మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్‌ ధర రూ.1.60 లక్షల దిగువకు పడిపోయింది. బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్‌ ధర రూ.1,100 తగ్గి రూ.1,58,800గా నమోదైంది. గత శుక్రవారం ఇది రూ.1,59,900గా ఉన్నది. ఇటు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్‌ పదిగ్రాముల గోల్డ్‌ రేటు వెయ్యికి పైగా తగ్గింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News