- చార్జీలు పెంచే యోచనలో సంస్థలు..
- పెరిగిన ఇంధన ధరలతో తప్పని పరిస్థితులు..
పెరిగిన ఇంధన ధరలతో విమానయాన సంస్థలు.. టికెట్ చార్జీలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే చార్జీలు పెరిగితే ప్రయాణి కులు తగ్గిపోయే వీలున్నదని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ప్రధాన ఆర్థికవేత్త మ్యారీ ఓవెన్స్ థామ్సన్ అభిప్రాయపడ్డారు. ధరల వ్యత్యాసాలు ప్రయాణికుల ప్రత్యామ్నాయాల అన్వేషణకు దారితీస్తాయన్నారు.
అమెరికా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది సహజంగానే భారత్ వంటి క్రూడాయిల్ దిగుమతి దేశాలను అన్ని రకాలుగా దెబ్బతీస్తున్నది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విమాన ఇంధనం రేటు 70 శాతం వరకు పెరుగవచ్చన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఐఏటీఏ పైవిధంగా స్పందించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 370కిపైగా ఎయిర్‌లైన్స్‌కు ఐఏటీఏ ప్రాతినిధ్యం వహిస్తున్నది.
