Friday, November 14, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంCourt Job Scam | కోర్టులో జాబు ఇప్పిస్తాం….

Court Job Scam | కోర్టులో జాబు ఇప్పిస్తాం….

  • తల ఒక్కరికి 15 లక్షలు కట్టండి…
  • ప్రజాపాలనలో కోర్టులు అబాసు పాలు..
  • బురిడీ కొట్టించిన యువకులు కనుమరుగు…
  • వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ప్రధాన నిందితులు…
  • చోద్యం చూస్తున్న జిల్లా పోలీసులు…….

నర్సంపేట: ప్రజాస్వామ్యం పక్కదారి పడుతున్న వేళ సెషన్స్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అంతర్జాతీయ కోర్టు ఆయా రాజ్యాంగాన్ని అనుసరించి ఆయా దేశాలలో అమలవుతున్న రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలణా చేసి లయ తప్పకుండా ఏర్పాటు చేసే వ్యవస్థను న్యాయవ్యవస్థ ను అలా ఓకగా ముగ్గురు జులై బడుద్దాయిలు నిరుద్యోగులకు తోకరా వేసి వారి తల్లిదండ్రులను సైతం ఒప్పించి ఒక్కో పోస్టుకు 15 లక్షల చొప్పున వసూలు చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకొని వరంగల్ జిల్లా కోర్టులో స్వీపర్గా, జూనియర్ అసిస్టెంట్ గా, అటెండర్ గా నియామకం చేపిస్తామని ఒక్కొక్కరి వద్ద నుండి సుమారు 10 లక్షలు కాజేసిన నిందితులు దొంగ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూనే బాధితులను మోసం చేయడానికి మరో అత్యున్నత న్యాయస్థాన స్టాంపులను సైతం వాడుకున్నట్లు బహిర్గతమవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో ఐదు కుటుంబాలలో చోటు చేసుకున్న విషాదచాయాలను ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేకంగా పరిశోధించింది. విందు వినోదాలలో పెళ్లి పేరంటాలలో కలుసుకున్న సదరు తెలంగాణ రాష్ట్రంలోని కోరుట్ల, మంచిర్యాల, ఖమ్మం జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు శివ, సంతోష్, రాధా కిషన్ ఒక గ్రూపుగా ఏర్పడి నిరుద్యోగులకు తోకరా వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన ఆవునూరి అనిల్ అను వ్యక్తిని మధ్యవర్తిత్వం ఏర్పాటు చేసుకొని టాప్ సీక్రెట్ మెయింటెన్ చేయాలంటూ చెప్పగా తన రజక కులం లోని వ్యక్తులని అనిల్ ఐదుగురిని ఎంపిక చేసి తల 15 లక్షలకు వరంగల్ ఖమ్మం కరీంనగర్ నల్గొండ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలలో కోర్టులో స్వీపర్, అటెండర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తామని నల్లబెల్లి మండలంలోని ముచింపుల, రంగాపురం, గుండ్ల పహాడ్, నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఐదుగురు వ్యక్తుల వద్ద నుంచి సుమారు 45 లక్షల రూపాయలు వసూలు చేశారు.

అపాయింట్మెంట్లు రేపు మాపు అంటూ దాటవేసిన సదరు ఖమ్మం, కోరుట్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సంతోష్, శివ, రాధాకృష్ణన్లు దాటా వేస్తూనే చివరకు ఫేక్ సర్టిఫికేట్ (అపాయింట్మెంట్ లెటర్) ఐదుగురికి సైతం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎక్కడ పోయి జాయిన్ కావాలని నిరుద్యోగుల తల్లిదండ్రులు వెంటాడంతో చివరకు ఖమ్మంలో దొరికిన ఒక వ్యక్తిని తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం నల్లబెల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ క్రమంలో నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన గ్రామ ఆవునూరి అనిల్ వారు డబ్బులు ఇవ్వకపోతే మీ డబ్బులు మీకు వాపసిస్తామని లేదంటే నా భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఈనెల 10వ తారీఖు నాడు వాయిదా పెట్టి పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయ్యారు.

ఈ ఘటనపై నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ ను వివరణ కోరగా నాకు ఎలాంటి సమాచారం లేదని వివరించారు. ఒక పక్క భూ దందా, స్కాములు, మొరం దందాలు, అవినీతి దందాలు నడుస్తున్న క్రమంలో సదరు భారతీయులందరూ నమస్కారం చేసే కోర్టు పేరు చెప్పి నిరుద్యోగ యువకులకు గాలం వేసి పబ్బం గడుపుతున్న సదరు వ్యక్తులను పోలీసులు దాయడం వెనక కారణం ఏమిటో తెలవకుండా ఉందని ప్రజలు వాపోతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News