బాధితులకు అండగా ఉంటామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భరోసా
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో (Chevella Bus Accident) మరణించిన తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీద్, సలీహ, జాహీరా ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.7 లక్షలు, ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కుల(Checks)ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (Buyyani Manohar Reddy-BMR) సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా (Vikarabad District) అడిషనల్ కలెక్టర్ సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, RTC డిప్యూటీ ఆర్ఎం సరస్వతి, రెవిన్యూ, RTC అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

తాండూరు మండలం గౌతాపూర్‌కు చెందిన ముస్కాన్ బేగం, తాండూరు పట్టణం వాల్మీకి నగర్ కు చెందిన కిష్టాపురం వెంకటమ్మ, బృందావన్ కాలనీకి చెందిన తబాస్సుం జహాన్, ఓల్డ్ తాండూరుకు చెందిన దస్తగిరి బాబా (బస్సు డ్రైవర్) మృతి చెందడంతో వారి నలుగురి కుటుంబాలను వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.7 లక్షలు, నలుగురికి మొత్తం రూ.28 లక్షల విలువ గల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించారు.

అనాధ పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటా
యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన కురుగంట బందప్ప, కురుగంట లక్ష్మీ దంపతులు మృతి చెందడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.7 లక్షలు, ఇద్దరికి మొత్తం రూ.14 లక్షల విలువ గల చెక్కులను అందించారు. అనాథలైన ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతతో పాటు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Illu) మంజూరు చేసి కట్టిస్తామని హామీ ఇచ్చారు.

యాలాల్ మండలం లక్ష్మీ నారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.7 లక్షల విలువ గల చెక్కును అందించారు.

అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది
యాలాల్ మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనుష ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.7 లక్షలు, ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల విలువ గల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించారు.
తాండూరు నియోజకవర్గానికి చెందిన 13 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను అందించిన అనంతరం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) మీడియాతో మాట్లాడారు.

