Sunday, June 14, 2026
Homeసాహిత్యంValues | సహవాస దోషం

Values | సహవాస దోషం

శవాన్ని తన భుజాన మోయడం..
ఓ పుణ్యకార్యం అంటున్న నరుడు
ప్రాణమున్న వ్యక్తికి చేయూత ఇవ్వడం
మహా పాపం అన్నట్లు ప్రవర్తిస్తాడు
మట్టిలో కలిసే మనిషి దోస్తూనే ఉంటాడు !

లేని దానికోసం దురాశ పడుతూ..
చేతులో ఉన్న దాన్ని చేజార్చుకోకు
ఉన్నదాంట్లో ఆనందం వెతకడం..
పేరాశతో దుఃఖాన్ని కొనితెచ్చు కోవడం..
జీవితాన్ని నరక సమానం చేస్తుంది !

- Advertisement -

మంచి బట్టలతో మంచి పేరు రాదు..
సత్కర్మలతోనే సమాజ గుర్తింపు
జీవన గమనాన్ని నిర్ధేశించేవి కర్మలు
కర్మలను వదిలి పూజలు చేయకు..
అవినీతి సొమ్ముతో హూండీలు నింపకు !

నిజమైన ప్రేమను గెలవడానికి..
అవసరమైతే తల వంచ వచ్చు
వెన్నెల రేడు చంద్రుడి రాక కోసం..
సూర్యుడు తలవంచి అస్తమిస్తాడు !

వంశపారంపర్యంగా ఆస్తి వస్తుంది
సద్బుద్ధి మాత్రం కర్మ ఫలంగా వస్తుంది
ఖాళీ చేతులతో వచ్చిన మనిషి..
మానవీయ విలువలతో ఖ్యాతి ఆర్జిస్తాడు
విలువలు లేని వ్యక్తి ప్రాణమున్న శవమే !

కర్ణుడు దానగుణ సంపన్నుడే..
చెడు సహవాసమే విలన్‌ చేస్తుంది
విషం చుక్క కలిసిన పాలు..
ఎన్నటికీ అమృతాహారం కాలేవు
మనం ఏమిటో మన స్నేహం చెబుతుంది !

- Advertisement -
RELATED ARTICLES

Latest News