Homeఆదాబ్ ప్రత్యేకంIrregularities | అధికారులే సాక్షి

Irregularities | అధికారులే సాక్షి

  • అక్రమ మార్గంలో సెల్లార్ బహుళ అంతస్తుల కమర్షియల్ భవనం
  • పైసా ఫేక్ తమాషా దేఖ్ అనే ధోరణిలో అధికారులు
  • అధికారుల అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా కమర్షియల్ భవనం
  • బాధ్యతారహిత అధికారులను విధుల నుండి తొలగించాలి
  • గృహ నిర్మాణాలకు అధికారికంగా అనుమతులు ఇవ్వాలి

మున్సిపాలిటీ కార్యాలయం అక్రమార్కుల అడ్డగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక సామాన్యుడు తలదాచుకునేందుకు చిన్నపాటి గృహ నిర్మాణం చేసుకోవాలంటే మున్సిపాలిటీ అనుమతులు లేవంటూ ఆంక్షలు విధించే అధికారులు మున్సిపాలిటీ కార్యాలయానికి ఎదురుగా ప్రధాన రహదారి పక్కన నెలసరి లక్షల్లో బాడిగల ఆదాయం సమకూరే విధంగా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తో కూడిన కోట్ల విలువచేసే బహుళ అంతస్తుల కమర్షియల్ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది ఎవరు…? అనే విషయం నేడు పెద్ద చర్చనీయాంశంగా మారింది

కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వసంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా…?

- Advertisement -

మున్సిపాలిటీ నిబంధనలను పరిరక్షించడం కోసం ప్రభుత్వ ధనం లక్షల రూపాయలు నెలసరి వేతనంగా పొందుతూ గతంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నేడు జవహర్ నగర్ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో విలీనమైన సందర్భంగా మల్కాజ్గిరి జోన్ కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వసంత మునిసిపాలిటీ నిబంధనల పరిరక్షణ కోసం కృషి చేయకపోవడానికి గల కారణాలు ఏమిటీ…?

ప్రధాన రహదారికి పక్కన మున్సిపాలిటీ కార్యాలయానికి ఎదురుగా అధికారుల సాక్షిగా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం అవుతున్న సెల్లార్ తో కూడిన బహుళ అంతస్తుల కమర్షియల్ భవన నిర్మాణం పనులు ఏదేచ్ఛగా కొనసాగుతూ నేడు గృహప్రవేశానికి చేరువవుతున్న ఈ అక్రమ భవన నిర్మాణం పై డిప్యూటీ కమిషనర్ వసంత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటీ…? మామూళ్ల మహత్యమా…? అక్రమ నిర్మాణదారుల దుస్సాహసమా…? విధి నిర్వహణలో అధికార బాధ్యత రాహిత్యమా…? అనే అనుమానాలు స్థానికుల నుండి వ్యక్తమవుతున్నాయి

Illegal commercial building construction allegations in Jawahar Nagar municipality0

ముడుపులకు ముచ్చట పడుతూ… మునిసిపల్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారా…?

గృహ నిర్మాణాలకు అనుమతులు లేని విషయాన్ని ప్రధాన హస్త్రంగా మలుచుకొని నివాసయోగ్యకరమైన భవన నిర్మాణాలు చేసుకోవాలంటే తెరచాటుగా అధికారులకు లక్షల్లో ముడుపులు చెల్లించుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని అధికారులు లంచం అడుగుతున్నారు అని ఎవరితోనైనా చెప్పినట్లయితే జీవితాంతం భవన నిర్మాణాలు చేసుకోలేరు అనే అధికారుల హెచ్చరికలకు లోనై తెరచాటు ఒప్పందాలు కుదుర్చుకొని దొడ్డి దారిన దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు… గుప్పుమంటున్నాయి..

లేని క్రమంలో ఎలాంటి పర్మిషన్ లు లేకుండా పుట్టగొడుగుల్లా వందలాది భవన నిర్మాణాల తతంగం ఎలా కొనసాగుతుందని గుసగుసలాడుతున్నారు ఇదే క్రమంలో ప్రధాన రహదారి పక్కన మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా సెల్లార్ తో కూడిన ఈ బహుళ అంతస్తుల కమర్షియల్ భవన నిర్మాణదారుడు తెరచాటుగా ఎన్ని ముడుపులు చెల్లిస్తే ఈ ఈ కమర్షియల్ అక్రమ భవన నిర్మాణం పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయో…? అనే అనుమానాలు బాహాటంగా వినిపిస్తున్నాయి

అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తే…? ఈ అక్రమ భవన నిర్మాణం కథ ఏమిటి…?

అధికారులు ఎలాంటి అనుమానాలు అపోహలకు తావివ్వకుండా సక్రమంగా విధులు నిర్వహించిన యెడల అధికారికంగా గృహ నిర్మాణాలకు అనుమతులు పొందలేని ఈ సమయంలో ప్రధాన రహదారి పక్కన మునిసిపాలిటీ కార్యాలయానికి ముందర నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తో పాటు బహుళ అంతస్తుల కమర్షియల్ మేలిమి భవన నిర్మాణం గృహప్రవేశానికి ఎలా ముస్తాబవుతోంధీ…? ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిన ఈ అక్రమ భవన నిర్మాణం వ్యవహారం చూస్తుంటే…

ప్రభుత్వం ఇచ్చే జీతాల కన్నా అక్రమ సంపాదనపై ఆసక్తి చూపుతూ విధి నిర్వహణలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనడానికి ఈ అక్రమ భవన నిర్మాణం నిలువెత్తు నిదర్శనం కాదా…? మున్సిపల్ నిబంధనలు ఈ భవన నిర్మాణదారునికి వర్తించవా…? అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు చట్టం చుట్టమా…? అని స్థానికులు మండిపడుతున్నారు

అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను విధుల నుండి తొలగించాలి

జవహర్ నగర్ ప్రాంతంలో గృహ నిర్మాణాల పర్మిషన్లు పూర్తిస్థాయిలో రద్దు చేయబడిందని భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కుదరదని నిత్యం హెచ్చరించే అధికారులే చట్టానికి సవాల్ విసురుతూ ఏలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మించిన ఈ అక్రమ భవన నిర్మాణంపై నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పూర్తి సహాయ సహకారాలు అందించిన అధికారులను విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులుగా గుర్తించి తక్షణమే విధుల నుండి తొలగించాలని గృహ నిర్మాణాల అనుమతులు లేకపోవడమే ప్రధాన కారణంగా అధికారులు అక్రమార్కులుగా మారుతున్నారనే విషయాన్ని గమనించి జవహర్ నగర్ ప్రాంతంలో గృహ నిర్మాణాలకు అధికారికంగా అనుమతులు పొందే సదావకాశాన్ని కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News