Homeరంగారెడ్డిVikarabad | వికారాబాద్‌ జిల్లాలో విషాదం క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు గొర్రెల కాపరులు...

Vikarabad | వికారాబాద్‌ జిల్లాలో విషాదం క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి.

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో(Vikarabad) విషాద ఘటన చోటుచేసుకుంది. ధరూర్ మండలం తరిగోపుల గ్రామ పరిధిలోని ప్రభుత్వ పట్టా భూముల్లో నామమాత్రపు అనుమతులు తీసుకుని పెద్ద ఎత్తున మైనింగ్ నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో క్వారీ తవ్వకాలతో ఏర్పడిన లోతైన నీటి గుంతలో పడి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. సమాచారం అందుకున్న ధరూర్ ఎస్ఐ సురేష్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇద్దరు మృతి(Two Shepherds Dead) చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్రమ తవ్వకాల కారణంగా ఏర్పడిన లోతైన నీటి గుంతలు ప్రాణాంతకంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుద్ధ క్వారీ తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, భద్రతా చర్యలపై సంబంధిత మైనింగ్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News