- మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం..
- ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించిన మహిళా సంఘం నాయకులు..
రెండున్నర ఏళ్ల క్రితం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలను పీహెచ్సీ నుండి 30 పడకల సిహెచ్ సిగా అప్ గ్రేడ్ చేశామని పాలకులు చెబుతున్నా సి హెచ్ సి కి సరిపడా వైద్యులను, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైపల్యం చెందినట్లు అఖిలభారత మహిళా తంత్ర మహిళా సంఘం నాయకులు ఆరోపించారు. శనివారం మండల పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ ఏజెన్సీ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలను ముప్పై పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
వైద్యశాలకు ప్రతిరోజు మండలంలోని వివిధ గ్రామాల నుంచి 200 మందికి పైగా రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. వారికి వైద్య సేవలు అందించడానికి సరిపడా వైద్యులు అందుబాటులో లేరు. ఒక వైద్యుడు తో వైద్య సేవలు అందిస్తున్నారు. మహిళల వైద్య చికిత్స కోసం గైనకాలజిస్ట్ అవసరమున్న ఇప్పటివరకు గైనకాలజిస్ట్ను నియమించలేదు. పిల్లలకు సంబంధించిన వైద్య నిపుణులు అందుబాటులో లేరు. గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సమయంలో సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో దూరంలో ఉన్న ములుగు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేస్తున్నారు. దాంతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన వస్తుంది.
ఎక్స్రే, ఈసీజీ, వంటి సౌకర్యాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృశ్య డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వ వైశాల్లో ఏజెన్సీ ప్రజలకు సరిపడా మందులు, వైద్యులను నియమించాలని లేనిపక్షంలో అఖిలభారత మహిళ తంత్ర మహిళా సంఘం తరఫున పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. బృందంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవేంద్ర, నాగలక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు సాధన పెళ్లి దేవి, మజా సుహాసిని, సునారికాని నిర్మల, నిమ్మకంటి స్రవంతి, సినిగిరి సత్యవతి, పుల్లరి యశోద, కురసం శారద, యాలం నాగమణి, రామోజీ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
