పేరు నమోదులో అధికారుల అనవసర అభ్యంతరాలు(Unnecessary objections)
వివిధ లా కాలేజీల్లో చదువు పూర్తిచేసుకొని పట్టాలు పొందిన విద్యార్థులు న్యాయస్థానం(Court)లో న్యాయ సాధన కోసం తెలంగాణ బార్ కౌన్సిల్‌లో తమ పేరును నమోదు (Registration) చేసుకోవడానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వస్తుంటారు. అయితే చదువుల మధ్య గ్యాప్ ఏర్పడిన విద్యార్థులు గ్యాప్ అఫిడవిట్ (Gap Affidavit) సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి సోమవారం, మంగళవారం హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయం కొత్త విద్యార్థుల(Students)తో కిటకిటలాడిపోతుంది. ఒకవేళ పత్రాలు (Documents) పూర్తిగా సరైనవిగా లేకపోతే బార్ కౌన్సిల్ నియమాల (Rules) ప్రకారం వారిని సంవత్సరం వారీగా రూ.700 చొప్పున ఫీజు (Fees) చెల్లించమని సూచిస్తుంది.
కానీ.. బార్ కౌన్సిల్ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా కొందరి అఫిడవిట్లు సరిగా లేవని చెబుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం (Agriculture) చేసిన విద్యార్థులు లేదా వివాహం (Marriage) జరిగిన మహిళా విద్యార్థుల అఫిడవిట్లను తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థులు తమ కుటుంబ భూముల్లో వ్యవసాయం చేస్తూనే లా డిగ్రీ పూర్తిచేశారు. అయితే అధికారులు “చదువుతూనే వ్యవసాయం ఎలా చేస్తారు?” అంటూ ప్రశ్నించడం, వారి అఫిడవిట్లను నిరాకరించడం విద్యార్థులకు అవమానంగా మారింది.
‘వ్యవసాయం చేసినంత మాత్రాన లాయర్(Lawyer) కావడానికి అనర్హులమా?. కష్టపడి చదివినవాళ్లను ఈ విధంగా అవమానించడం సరికాదు’ అని ఆదిలాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే మహిళా లా విద్యార్థులు కూడా తమ చదువుల మధ్య వివాహం జరిగినట్లు అఫిడవిట్‌లో పేర్కొంటే బార్ కౌన్సిల్ అధికారులు అవసరంలేని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి వంటి జిల్లాల నుండి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యాయవేత్తలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. ‘బార్ కౌన్సిల్ బాధ్యత పత్రాలు పరిశీలించడం మాత్రమే. విద్యార్థులను అవమానించడం సరికాదు. ఇది సమానత్వ హక్కులను, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించే చర్య’ అని సీనియర్ లాయర్ దినేష్ అభిప్రాయపడ్డారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణ జోక్యం చేసుకోవాలని న్యాయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం, విద్య రెండూ దేశ అభివృద్ధికి ప్రధాన స్తంభాలు. వాటిని కలిపి చూసినవారిని నిరుత్సాహపరచడం తగదు. బార్ కౌన్సిల్ నిజాయితీని గౌరవించాలి. విద్యార్థులను అవమానించడం ఆపాలని హైకోర్టు సీనియర్ లాయర్లు కోరుతున్నారు.
