Homeఆదిలాబాద్Inspection | నిర్మల్, బైంసా సబ్ డివిజన్ లో పోలీసుల తనిఖీలు

Inspection | నిర్మల్, బైంసా సబ్ డివిజన్ లో పోలీసుల తనిఖీలు

మంగళవారం నిర్మల్, బైంసా సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. బైంసా ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో చింతల్ బూరి గ్రామంలో, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో బావాపూర్ (ఆర్) గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 135 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Nirmal Bhainsa Cordon Search Operation
- Advertisement -
RELATED ARTICLES

Latest News