Tuesday, May 26, 2026
HomeతెలంగాణKokapet Lake | కోకాపేట చెరువు పునరుద్ధరణ పనులు..

Kokapet Lake | కోకాపేట చెరువు పునరుద్ధరణ పనులు..

  • అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా..
  • గోల్డ్ ఫిష్ విల్లాస్ కి చెందిన ప్రహారీ కూల్చివేత..

హైదరాబాద్‌ నార్సింగి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని కోకాపేట్ కొత్తచెరువు పునరుద్ధరణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా అధికారులు మరోసారి గట్టి చర్యలు చేపట్టారు. కొత్తచెరువు పరిధిని (ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్) ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన ప్రముఖ “గోల్డ్ ఫిష్ విల్లాస్”కు చెందిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది భారీ యంత్రాలతో కూల్చివేశారు.

ఈ కూల్చివేత సమయంలో హైడ్రా సిబ్బందితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉండి పనులను పర్యవేక్షించారు. స్వాధీనం చేసుకున్న చెరువు భూభాగం భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అధికారులు తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా చెరువు చుట్టూ శాశ్వత ప్రాతిపదికన ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను అధికారులు అక్కడికక్కడే మొదలుపెట్టారు.

- Advertisement -

రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ, సహజ నీటి వనరుల సంరక్షణ, భూ ఆక్రమణల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News