జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)కు తెలంగాణ జన సమితి (Telangana Jana Samithi-TJS) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం (Kodanda Ram) తెలిపారు. షేక్‌పేట ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓయూ కాలనీలో మంత్రులు వివేక్ వెంకటస్వామి(Vivek), అజారుద్దీన్(Azharuddin)లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలంగాణ జన సమితి మద్దతు కోరారని తెలిపారు. ఈ నేపథ్యలో టీజేఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు పలకాలని కోరారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఘనత కోదండరామ్‌దని అన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య, జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్ హనుమంతు గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు నిజ్జల రమేష్ ముదిరాజ్, సలీం పాషా, ఆంజనేయులు, దేశపాక శ్రీనివాస్, దారా సత్యం, తుల్జా రెడ్డి, ఆకుల శ్రీనివాస్, హనుమంతు రెడ్డి, జస్వంత్ కుమార్, రవికాంత్, సురేష్, రసూల్, ఇస్మాయిల్, లక్ష్మణ్, జహీర్, శేఖర్, సుధాకర్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు
