కరీంనగర్ కొత్తపల్లి లోని తేజస్ జూనియర్ కళాశాల డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో అద్భుత ఫలితాలు సాధించినట్లు తేజస్ డిఫెన్స్ జూనియర్ కళాశాలల చైర్మన్ సిఎస్ సతీష్ రావు తెలిపారు. ఎంపీసీ ప్రథమ సంవత్సర విభాగంలో 470 మార్కులకు గాను ఏ కార్తికేయ 467 బి నివేదన 467 పి సాయి చరణ్ 466 బి నితిన్ 466 బి సాయి తేజ 465 నందకిషోర్ 465 మార్కులు సాధించగా సీఈసీ మొదటి సంవత్సరం విభాగంలో 500 మార్కులకు గాను శ్రీ చైతన్ 483 వంశీ నాయక్ 478 వరుణ్ తేజ 475 మార్కులు సాధించారు బైపీసీ మొదటి సంవత్సర విభాగంలో పి ఆదిత్య నాయక్ 440 మార్కులకు గాను 426 మార్కులు సాధించారు
ఎంపీసీ ద్వితీయ సంవత్సర విభాగంలో 1000 మార్కులకు గాను శ్రీ వర్ధన్ 993 రిషిత్ యాదవ్ 992 నందీశ్వర్ రెడ్డి 992 వర్షిత్ 992 మార్కులు సాధించగా సీఈసీ ద్వితీయ సంవత్సరం విభాగంలో 1000 మార్కుల గాను వీ రామచరణ్ 972 వై నవదీప్ 969 రాజేందర్ 968 మార్కులు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సర విభాగంలో 1000 మార్కులకు గాని జగన్ 954 మార్కులు సాధించినట్లు తెలిపారు. తేజస్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమైన ప్రతిభను కనబరిచి ఉన్నత ఫలితాలు సాధించడం తమకెంతో గర్వకారణం అని విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉత్తమ ఫలితాలను సాధించడంలో తోడ్పడిన తల్లిదండ్రులు అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు.
