Homeమహబూబ్‌నగర్‌Life Lessons | విద్యార్థులకు జీవిత పాఠాలు కూడా నేర్పించాలి.

Life Lessons | విద్యార్థులకు జీవిత పాఠాలు కూడా నేర్పించాలి.

  • పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ బాబు.

ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలలోని పాఠాలనే కాకుండా జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనే జీవిత పాఠాలు కూడా నేర్పించాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ బాబు ఉపాధ్యాయులకు సూచించారు. ఈరోజు మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని కోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ చేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రామచంద్రారెడ్డి సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారి అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ రామచంద్రరెడ్డి నిజాయితీతో, నిక్కచ్చిగా నిబద్ధతతో పనిచేశాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీ హెచ్ ఎం లు గోపాల్ నాయక్, కాళిదాసు, కోడూరు మాజీ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని రామచంద్రారెడ్డి సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News