Homeమహబూబ్‌నగర్‌Kalwakurthy | రూ.1.30 కోట్లతో మినీ స్టేడియం

Kalwakurthy | రూ.1.30 కోట్లతో మినీ స్టేడియం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పలు అభివృద్ధి, విద్యా, పర్యావరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ముందుగా సుమారు రూ.1.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు మినీ స్టేడియంఉపయోగపడుతుందని అన్నారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ అనంతరం మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ఉచిత యూనిఫాంలను పంపిణీ చేశారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, విద్యతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నట్లు సంబంధిత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మొక్కలు నాటిన ఎమ్మెల్యే తదుపరి మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News