- ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ కి వినతి పత్రం…
వెంకటాపురం మండలంలోని ప్రైవేట్ స్కూళ్లలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సిద్దబొయిన సర్వేశ్వరరావు, చింత సోమరాజు, కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ వెంకటాపురం మండలంలో ప్రవేట్ పాఠశాలలలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యా హక్కుచట్టం ప్రకారం పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారిని కోరారు. ప్రతి పాఠశాలలో బాలురు, బాలికలకు వేరువేరుగా బాత్రూమ్స్ ఉండాలని కోరారు.
బాత్రూమ్స్ లేని స్కూల్స్ ని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి బయటపడి ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి పాఠశాలకు ఆట స్థలాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలతో పాటు,స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని కోరారు. ప్రధానంగా పాఠశాలలలో బస్సులు ఫిట్నెస్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, అట్టి స్కూల్ బస్సులపై సంబంధిత శాఖ చర్యలు తీసుకొని ఇట్టి పాఠశాలలపై విద్య హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
