- చట్టవిరుద్ధమైన అక్రమాలకు పాల్పడితే వారు ఎవరైనా సరే శిక్ష తప్పదు అంటున్న ఎస్సై కురుమూర్తి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలా గ్రామ పరిధిలోని శ్రీ రామకృష్ణ రైస్‌మిల్‌లో ప్రభుత్వ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(PDS) బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, అనే సమాచారంపై సివిల్ సప్లై డిటి హేమ్లా నాయక్ స్థానిక పోలీసులు, వారి సిబ్బందితో కలిసి మిల్‌పై దాడి నిర్వహించారు.
అక్కడి నుంచి డీసీఎం వాహనంలో లోడ్ చేయబోతున్నట్లు కనిపించిన దాదాపు 324 బస్తా, సుమారు 162 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం, అలాగే ఆ బియ్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని అధికారులు సీజ్ చేసినట్టు కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా పబ్లిక్ పంపిణీ కోసం కాని ఇతర ప్రయోజనాల కోసం కాని పంపిణీ నిబంధనలు ఉల్లంఘించి బియ్యం విక్రయించడం వల్ల సంబంధించిన చర్యలు తీసుకోబడ్డాయని తెలిపారు. ఎవ్వరైనా చట్ట విరుద్ధమైన అక్రమాలకు పాలుపడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని, అక్రమాలకు పాల్పడ్డ వారు ఎవరైనా ఉపేక్షించేది లేదంటూ కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి హెచ్చరించారు.
