Homeహైదరాబాద్‌SIR | ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్ల పంపిణీ….

SIR | ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్ల పంపిణీ….

  • ఓటర్లకు దరఖాస్తుల అందజేత.. అవగాహన కల్పించిన బీజేపీ నాయకులు ఈర్ల రాజు ముదిరాజ్

పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ కార్యక్రమం నిర్వహించారు. అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో వివిధ కాలనీల్లో పర్యటించి ఓటర్లకు ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్లను పంపిణీ చేశారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు, మార్పులు ఉంటే దరఖాస్తుల ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

SIR Voter List Awareness Program in Kistareddypet and Patelguda2

ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు వివరాలు తెలిపిన బీఎల్ఏలు బీఎల్ఓలు, బీఎల్ఏ-2లతో కలిసి కాలనీల్లో పర్యటించిన నాయకులు ఓటర్ జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సక్రమంగావినియోగించుకునేలా ఓటర్ జాబితాలో వివరాలు సరిగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఏ-2 సముద్రాల రాకేష్, బీఎల్ఏ-2 రాజ్ కుమార్, బీఎల్ఓ జనార్ధన్, బీజేపీ నాయకులు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పారదర్శకమైన ఓటర్ జాబితా కోసం సహకరించాలని విజ్ఞప్తి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని నాయకులు కోరారు. మీ ఈర్ల రాజు ముదిరాజ్ అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు

- Advertisement -
RELATED ARTICLES

Latest News