- టి 20, వన్డే సీరీస్ రెండూ చేజారిపోయాయి..
- తన అభిప్రాయం వ్యక్తం చేసిన కెప్టెన్ గిల్..
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్ చేజారినా.. వన్డే సిరీస్ అయినా గెలుస్తామనుకుంటే అది కూడా అప్పగించేసింది భారత జట్టు. పసలేని బౌలింగ్ కారణంగా లార్డ్స్ వన్డే లో భారీ స్కోర్ సమర్పించుకున్న టీమిండియా.. రోహిత్ శర్మ శతకం కొట్టినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. 1-2తో సిరీస్ కోల్పోవడంపై మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తమ పరాజయానికి గాయాలూ ఓ కారణమని చెప్పాడు. ఆటగాళ్లు ఫిట్నెస్ను లైట్‌గా తీసుకోవడంపై గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టుకు ఇంగ్లండ్ పెద్ద షాకిచ్చింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుపొంది టీమిండియా మేనేజ్మెంట్ను ఆలోచనల్లో పడేసింది. సిరీస్ మధ్యలో ఆటగాళ్లు గాయాల బారిన పడడం, పేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లించింది శుభ్‌మన్ గిల్ సేన. మ్యాచ్ అనంతరం ‘సిరీస్ ఓటమికి గాయాలూ ఓ కారణమా?’ అని విలేకరులు ప్రశ్నించగా ‘అవును’ అని బదులిచ్చాడు గిల్.
