Homeమెదక్‌Chinta Sainath | సంగారెడ్డిలో వినాయక మండపాలను దర్శించుకున్న చింత సాయినాథ్

Chinta Sainath | సంగారెడ్డిలో వినాయక మండపాలను దర్శించుకున్న చింత సాయినాథ్

  • ​గణనాథుడికి ప్రత్యేక పూజలు.. అన్నప్రసాద వితరణ
  • ​మండపాల నిర్వాహకులకు అభినందనలు
  • ​సాయినాథ్‌కు ఘన స్వాగతం పలికిన యువత, భక్తులు
  • ఐక్యత, భక్తిభావంతో ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపు

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని పలు వినాయక మండపాలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) తనయుడు చింత సాయినాథ్(Chinta Sainath) సందర్శించారు.

​ప్రత్యేక పూజలు:

- Advertisement -

ప్రగతి అసోసియేషన్, వసంత్‌నగర్, పోతిరెడ్డిపల్లి వివేకానంద యూత్, వివేకానందనగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

​ఘన స్వాగతం – అన్నదానం:

ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులు, యువత చింత సాయినాథ్‌కు(Chinta Sainath) ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పలు మండపాల వద్ద చేపట్టిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

​”వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని చాటిచెప్పేలా నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయం. ఉత్సవాలను అందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.”

  • చింత సాయినాథ్

హాజరైన ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో లాడే మల్లేశం, శ్రవణ్ రెడ్డి, మోహన్ సింగ్ నాయక్, వెంకట్, మల్లేశం గౌతమ్, దిలీప్, వాజిత్, అఖిల్ తదితరులతో పాటు ఆయా మండపాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు, యువకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News