- అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ నటించిన యాడ్..
- మహిళను అసభ్యకరంగా చిత్రీకరించిన వైనం..
ప్రముఖ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ నటించిన ఒక వాణిజ్య ప్రకటన ఇప్పుడు తీవ్ర వివాదాన్ని(Ad Controversy) రాజేసింది. స్పోర్ట్స్ ప్రెడిక్షన్ ప్లాట్‌ఫామ్ అయిన ‘నోవిగ్’ కోసం రూపొందించిన ఈ యాడ్‌లో క్రీడల్లో మహిళలను లైంగిక వస్తువుగా, కించపరిచేలా చూపించారంటూ ప్రపంచవ్యాప్తంగా మహిళా అథ్లెట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.
ఈ వివాదాస్పద యాడ్‌లో సిడ్నీ స్వీనీ దాదాపు దుస్తులు లేకుండా, ఫుట్‌బాల్స్, ఇతర క్రీడా పరికరాలతో శరీరాన్ని కప్పుకున్నట్లుగా కనిపించారు. దీనిపై నాలుగుసార్లు ఒలింపిక్ స్విమ్మింగ్ స్వర్ణ పతక విజేత, ఆస్ట్రేలియాకు చెందిన అరియార్న్ టిట్మస్ తీవ్రంగా స్పందించింది. “ఇది చూసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మన సమాజం ఇప్పటికీ మహిళల శరీరాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడం, మహిళల క్రీడలను లైంగిక వస్తువులుగా చూపించడం ఆపలేదా?” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించింది. బ్రిటిష్ స్ప్రింటర్ అమీ హంట్ మరో అడుగు ముందుకేసి, బుడాపెస్ట్‌లో జరిగిన అల్టిమేట్ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేరుగా స్పందించింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
