- ఆగష్టు 26న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని మనవి..
- తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన కేశవరావు..
- వారిషికోత్సవ కార్యక్రమ విశిష్టతను వివరించిన సీఎండీ సత్యం వీరమళ్ళ..
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు (కేకే)ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఆదాబ్ హైదరాబాద్ సీఎండీ సత్యం వీరమల్ల.. వచ్చే నెల ఆగస్టు 26 న నిర్వహించనున్న ‘ఆదాబ్ హైదరాబాద్’ తెలుగు దినపత్రిక 15వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సత్యం వీరమల్ల వార్షికోత్సవ కార్యక్రమం విశిష్టతను వివరించగా.. కె. కేశవరావు ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించి, తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ మర్యాదపూర్వక భేటీలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
- Advertisement -
