ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశానుసారం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని చిన్న రావిరాల గ్రామంలో(Chinnaraviryala Village), మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బింగి దేవదాసు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ కమిటీ, యువజన కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
చిన్న రావిరాల గ్రామ శాఖ అధ్యక్షులుగా చింతల మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బంగారి సత్యనారాయణ, సద్దుపల్లి శివశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కండికోట శివశంకర్ రెడ్డి, కోశాధికారిగా శేఖర్ రెడ్డి తోపాటు పలువురుని నియమించారు. యువజన కాంగ్రెస్ విభాగంలో యువజన గ్రామ అధ్యక్షులుగా కారెడ్డి అమూల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బండారి శివ, ప్రధాన కార్యదర్శిగా ఒంటేదు శ్రీనివాస్, కోశాధికారిగా శివ, కార్యదర్శిగా సంపంగి అనిల్ ని నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బింగి దేవదాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు భాస్కరాచారి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రణీత్ యాదవ్, గ్రామ సర్పంచ్ కిషన్ గౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, సీనియర్ నాయకులు కొలను రవీందర్ రెడ్డి, లింగారెడ్డి, ధర్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
