HomeఫోటోలుTatvam | అక్టోబర్ 2 న "తత్వం" మూవీ విడుదల

Tatvam | అక్టోబర్ 2 న “తత్వం” మూవీ విడుదల

కొత్త కథతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా తెరకెక్కుతున్న చిత్రం ‘తత్వం'(Tatvam ) మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. కాగా ఈ చిత్రంను అక్టోబర్ 2 న సినిమాను థియేట్రికల్ విడుదల చేస్తూ నట్లు ప్రకటించారు మేకర్స్ . దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు.

త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ  మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్ ఇది.  సంగీతానికి స్కోప్‌ ఉన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అందరికి నచ్చింది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ కుదిరాయి. అందరూ ఈ సినిమా కోసం ఎంతో సపొర్ట్‌ చేశారు. అర్జున్‌ కోలా ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. అనుకున్న కథను మించి దర్శకుడు తెరకెక్కించాడు. అందరికి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా’ అన్నారు.  

- Advertisement -

దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ ” సంగీతానికి ప్రాధ్యాన్యమున్న చిత్రమిది. చేతన్‌ భరద్వాజ్‌ కథకు తగ్గట్టుగా అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడు.  మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా తయారుచేసుకున్న కథ ఇది.  కథ తప్పకుండా అందరికి ఎంగేజింగ్‌గా ఉంటుంది. వంశీ గారి అన్వేషణ తరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా ఇది. ఈ సినిమాలో ఉంటే ట్విస్ట్‌ ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటుంది|’అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: భరత్‌ రోంగలి, ఎడిటర్‌: విప్లవ్‌ నైషదం,కెమెరా: భరత్‌ పట్టి, డిఐ: భూషణ్‌, దర్శకుడు: అర్జున్‌ కోల, నిర్మాత: వంశీ సీమకుర్తి.,శ్వేత పసుపులేటీ(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News