Homeరంగారెడ్డిMallepula Srikanth Yadav | వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

Mallepula Srikanth Yadav | వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

  • విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్‌నగర్ డివిజన్‌లలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్(Mallepula Srikanth Yadav) సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్(Mallepula Srikanth Yadav) మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -

వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు మండపాల వద్ద అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో మండపాలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు శాంతియుత వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లావణ్య సతీష్ గౌడ్, గొడుగు వేణు ముదిరాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్, స్థానిక నాయకులు అశోక్ గుప్తా, వెంకటయ్య యాదవ్, యాదగిరి యాదవ్, నవీన్, శివతో పాటు ఆయా వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News