రాష్ట్రంలో రైతు సమస్యలు ఇంకా పరిష్కారం కాని గాయాలుగానే మిగిలిపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం రైతును ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ట్రాఫిక్ సమస్యలు పట్టణ ప్రజల జీవనాన్ని నరకంగా మారుస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ప్రభుత్వాల దృష్టికి చేరడం లేదు.. విద్య, వైద్య రంగాల్లో ఇంకా అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల కోసం యువత నిరీక్షణ రోజురోజుకూ పెరుగుతోంది. గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రజల సమస్యలపై పాలకులు మాటలు కాదు.. చర్యలు చూపాల్సిన సమయం ఇది. “ప్రజల బాధలే నిజమైన రాజకీయ అజెండా”..
- హనుమకొండ ఉపేంద్ర చారి
- Advertisement -
