- నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకున్న గుప్తేదార్లు
- అలంకారప్రాయంగా క్రీడా ప్రాంగణాలు..
- అధికారుల పర్యవేక్షణ లోపం.. క్రీడాకారులకు పాలిట శాపం.
- యువ క్రీడాకారులకు అందని ప్రోత్సాహం…
నమ్మండి ఇవి క్రీడా మైదానాలే “అలా అనిపించడం లేదని ప్రజలు అంటున్న.. అవి ప్రభుత్వం, అధికారుల దృష్టిలో, అవి క్రీడా ప్రాంగణలే.గ్రామీణ ప్రాంతంలో క్రీడాలను, ప్రోత్సహించేందుకు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను, ప్రోత్సహించేందుకు, క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉద్దేశంతో ప్రతి గ్రామములో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఎకరానికి రెండు లక్షల రూపాయల చొప్పున, క్రీడా ప్రాంగణం వైశాల్యం బట్టి నిధులు మంజూరు చేసింది.


ఇందులో యువత వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఎక్సర్సైజ్ బార్లు , వాలీబాల్ కోర్టు, క్రీడా ప్రాంగణం అనే బోర్డు పాటు తదితర క్రీడలు ఆడేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయాలని అందుకు ఒక్కొక్క క్రీడా మైదానానికి 2,80,000 అంచనా చొప్పున నిధులు మంజూరు చేసింది. అధికారుల పర్యవేక్షణ లోపంగా ఎక్కడ కూడా సదరు కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయకుండానే బిల్లును డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్నిచోట్ల మట్టిని పోసి, క్రీడా ప్రాంగణం బోర్డులు పెట్టి, బిల్లులు డ్రా చేయగా మరికొన్ని చోట్ల బోర్డులు పాతకుండానే నామ్ కే వాస్తుగా ఫోటోలు దిగి బిల్లులు డ్రా చేసినట్లు ప్రజల ఆరోపిస్తున్నారు.


నాసిరకం పనులు, పైపై మెరుగులు దిద్ది బిల్లులు లేపగా, అందుకు కొందరు అధికారులు, కాంట్రాక్టర్ తో కుమ్ముకై చూసి చూడనట్టుగా వ్యవహరించారననే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ క్రీడాకరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ సంకల్పానికి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఆ లక్ష్యం పక్కదారి పడుతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండలంలోని రెండు మూడు గ్రామాలు మినహా దాదాపు అన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే ఉంది.


పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు, ఎందుకు నిమ్ముకు నీరెత్తినట్లుగా వ్యవహరించారో అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ధనం ఇలా దుర్వినియోగం కావడం పట్ల, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రాంగణలను, వాడుకలోకి తెచ్చి, క్రీడలు పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని క్రీడాకారులు, ప్రజలు కోరుతున్నారు.
