- ఆశావాహుల్లో పెరుగుతున్న టెన్షన్…
- నియోజకవర్గ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావాహుల పాట్లు..
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంల, గత పాలకవర్గ కమిటీలను రద్దు చేస్తూ, నామినేటెడ్ కమిటీలను నియమిస్తుండటంతో తాడ్వాయి మండల కేంద్రంలో సింగిల్ విండో చైర్మన్ పదవికి పోటీ తీవ్రమైంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు,డైరెక్టర్లు అందరిని కూడా స్థానిక ఎమ్మెల్యే ఇష్టానుసారం నామినేట్ పోస్టులు నియమించుకునే విధంగా ఎమ్మెల్యేలకు అధికారాలు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది.దింతో మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం చైర్మన్ పదవికి కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
అందుకోసం ఆశావాహులు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మెప్పు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కొందరు గత కొంతకాలంగా ఆయనకు ఎప్పుడూ టచ్ లో ఉంటూ, విధేయుడుగా ఉండేదుకు , ప్రయత్నం చేస్తుంటే, మరికొందరు రాష్ట్రస్థాయి బడా నాయకులతో పైరవీలు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తుది నిర్ణయం స్థానిక ఎమ్మెల్యేదే కావడంతో ఎమ్మెల్యే ఎవరు వైపు మొగ్గు చూపి, ఎవరికి పదవులు ఇస్తారో అని ఉత్కంఠత పెరుగుతుంది.
తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ గా పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు మొగ్గుచూపుతున్నారు . అందులో తాడ్వాయి మండల పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు జుకంటి వెంకట్ రెడ్డి, ఏండ్రియల్ గ్రామానికి చెందిన సుధాకర్ రావు, దేవయపల్లి గ్రామానికి చెందిన పైడి రాజేశ్వర్ రెడ్డి, తాడ్వాయి గ్రామానికి చెందిన దమ్మన్నగారి రాజేశ్వర్ రెడ్డి, కృష్ణాజివాడి గ్రామానికి చెందిన షేరు బద్దం రమణారెడ్డి, లు ప్రధానంగాపోటీలో ఉన్నట్లు తెలుస్తుంది.
తాడ్వాయి మండల పరిధిలోని మరొక సింగిల్ విండో కార్యాలయమైన దేమేకలాన్ సొసైటీ పదవికి సైతం పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. చైర్మన్ పదవి ఆశిస్తున్న ఆశావాహులో ప్రముఖంగా కన్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం ప్రతాపరెడ్డి, కన్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సరసాని భూపతి రెడ్డి, కన్కల్ గ్రామానికి చెందిన మరో సీనియర్ నాయకుడు ఏనుగు ఏనుగు వెంకటరెడ్డి, కరెడ్ పల్లి గ్రామం బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ మురళి సైతం పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది.
పదవులకు మంచి డిమాండ్, పోటీ తీవ్రత ఎక్కువ.
ప్రాథమిక సహకార సంఘల బాడీ సభ్యుల పదవులకు , అటు రైతుల్లో, ఇటు ప్రజల్లో కానీ మంచి పలుకుబడి ఉండడంతో అందుకు పోటీ చేసేందుకు ఆశావాహల వాళ్ళ సంఖ్య తీవ్రంగానే ఉంది. సింగిల్ విండో చైర్మన్ పదవి ద్వారా, రైతులకు కావాల్సిన చాలా పనులు జరుగుతుండడం వల్ల ఆ పదవులకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది. అధ్యక్ష పదవి నుంచి డైరెక్టర్ పదవి దాకా ప్రజల్లో వీరికి మంచి గుర్తింపు ఉండటం వల్ల ఆయా పదవులకు డిమాండ్ సైతం భారీగానే ఉందని చెప్పాలి. వారం రోజుల్లోగా, ఆయా సింగిల్ విండోలకు నామినేటెడ్ కమిటీ పదవులు, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రకటిస్తారని చర్చ జోరుగానే సాగుతుంది.
