కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొబిషన్ ఎక్సైజ్ అధికారి వి. వేణుగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఇటీవల ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం నిర్వహించినట్టుగా ఎక్సైజ్ సీఐ జే, వెంకటరెడ్డి తెలిపారు, ఈ వేలంలో మొత్తం 13 వాహనాలు విక్రయించబడ్డాయి. వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు మొత్తం రూ. 2,47,000 జమ చేయబడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ జే. వెంకటరెడ్డి సహా స్టేషన్ సిబ్బంది, జంగయ్య, జనార్దన్ రెడ్డి, మణిందర్, సిద్ధార్థ్, అనిల్ చంద్రశేఖర్, తేజశ్రీ, సునీతలు పాల్గొన్నారు.

- Advertisement -
