- బెల్లంపల్లి CI సీఎచ్ హనూక్.
- రాచకట్ల శ్రీనివాస్ గారు మరణించిన జీవిస్తున్నారు.
బెల్లంపల్లి పట్టణం లోని ఇంక్లైన్ బస్తీ వాస్తవ్యులు నేత్రదాత కీ.శే. రాచకట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ వారి స్వగృహంలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి రూరల్ CI CH. హనూక్ హాజరై నేత్రదాత కీ.శే. రాచకట్ల శ్రీనివాస్ గారికి నివాళులు అర్పించారు నేత్రదాత కీ.శే. రాచకట్ల శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు భార్య రాచకట్ల మానస, తల్లి రాచకట్ల దేవి, కుమారుడు ఋషి కుమార్, కుమార్తె అక్షయ మరియు కుటుంబ సభ్యులని అభినందించి ప్రశాంస పత్రం అందించి శాలువాతో సత్కరించారు.
CI హనూక్ మాట్లాడుతూ ప్రతి మనిషికి మరణం తప్పదని జీవించినపుడు ఇతరులకి సహాయపడాలని కీ.శే. రాచకట్ల శ్రీనివాస్ నేత్రదానం ద్వారా మరణించిన జీవిస్తూ వారి నేత్రాల ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని వీరి స్పూర్తితో మరింత మంది నేత్ర అవయవ దానాలకి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్రదానం ద్వారా అందులకి చూపునివ్వవగలమని, అవయవదానం వల్ల ప్రాణ దానం చేయవచ్చని శరీర దానం ద్వారా వైద్య విద్యార్థులకి పరిశోధనకి ఉపయోగపడవచ్చని తెలిపారు. మనం సమాజానికి ఉపయోగపడే విధంగా మంచిని పంచి కృషి చేయాలని తద్వారా ధన్య జీవులుగా మిగలాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ నేత్రదాత కీ.శే. రాచకట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు 6 వ వార్డు కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి గారు నేత్రదానం గురించి వివరించగా పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఇద్దరు అందులకి చూపునివ్వాలని ఆలోచించి నేత్రదానం చేయడం అభినందనీయం అని జనహిత సేవా సమితి ద్వారా ఇది 15వ నేత్రధాన కార్యక్రమం అని వారి స్ఫూర్తితో ప్రజలందరూ మరణించిన తరువాత నేత్ర, అవయవ,శరీరాలు వృధా కాకుండా దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని నేత్రదానం చేసినపుడు మరణించిన తరువాత ఎనిమిది గంటల లోపు మరణించిన వ్యక్తి యొక్క కళ్లలోని కార్నియా పొరని మాత్రమే సేకరిస్తారని నేత్ర దానం ద్వారా ఇద్దరు అందులకి చూపు ప్రసాదించి వారి ద్వారా మరణించిన ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారి అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో అవయవాలు అవసరం ఉన్న 6గురు మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని అలాగే శరీర దానం ద్వారా పార్థివ దేహాన్ని వైద్య కళాశాల కి అందించి కొన్ని వేల వైద్య విద్యార్థుల బోధనకు ఉపయోగపడి ప్రజల వైద్య చికిత్స కి ఉపయోగపడే అవకాశం ఉందని ప్రజలందరూ అపోహలు వీడి నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి జనహిత సేవా సమితి సహాయ కార్యదర్శులు గుమ్ముల చందు, పెద్ది వినయ్ కుమార్,కార్యవర్గ సభ్యులు డోలి సుకుమార్, మరియు నేత్రదాత కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, బస్తి వాసులు పాల్గొన్నారు.
