- జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్.
- నందిగామ గ్రామపంచాయతీ సందర్శించిన డిపిఓ.
గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలను(Gram Sabha) కార్యాలయాల కాకుండా బహిరంగంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ పేర్కొన్నారు. నందిగామ మండల(Nandigama Mandal) కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, నిధుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.
గ్రామ సభకు ఖచ్చితంగా వందమంది పైనే హాజరవ్వాలని,అలాంటప్పుడే సమస్యలు వెలుగులోకి వస్తాయని, క్షేత్ర స్థాయిలో జరిగే పనులు దృష్టికి వస్తాయన్నారు.మరోసారి గ్రామసభలను నాలుగు గోడల మధ్య, కార్యాలయాల్లో కాకుండా బహిరంగంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు,పాలవర్గానికి తెలిపారు.జిల్లా అధికారి వచ్చినప్పటికీ మహిళ వార్డు సభ్యులు మూకుమ్మడిగా గైహాజరవ్వడం కొసమెరుపు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము కృష్ణ,కార్యదర్శి రాజు,పంచాయతీ పాలకవర్గం, తదితరులు పాల్గొన్నారు.
