గరిడేపల్లి: గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం–కీతవారిగూడెం గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాళ్ల మల్కాపురం వద్ద నూతన వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన భారీ వర్షానికి కొట్టుకుపోయింది.(Bridge Collapse) నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో తాత్కాలిక వంతెన వద్ద రహదారి కొట్టుకుపోయింది. దీంతో తాళ్ల మల్కాపురం, కీతవారిగూడెం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక వంతెనకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)
Bridge Collapse | తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు బంద్
By Aadab Desk
- Advertisement -
Previous article
