అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, బండరావిరాల గ్రామంలోని(Bandaravirala Village) అంబెడ్కర్ యువజన సంగం గణేశుని మండపం వద్ద వనస్థలిపురం ఏసీపీ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలు, పోక్సో చట్టం, మహిళలు, ప్రజల భద్రతపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
సర్పంచ్ కందికంటి విజయకుమార్ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ సిఐ అశోక్ రెడ్డి, వనస్థలిపురం సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాస్, అబ్దుల్లాపూర్ మెట్ ఎస్ఐ ప్రియాంక రెడ్డి పాల్గొని గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, చిన్నారుల భద్రత, పోక్సో చట్టంపై ముఖ్యమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అలాగే ఇంస్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు అవగాహనతో పర్యవేక్షణ కలిగి ఉండాలని, పిల్లలు ఫోన్లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారు అనే విషయాలపై వయస్సుకు తగిన విధంగా శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల రక్షణకు కుటుంబం, సమాజం, పోలీసు వ్యవస్థ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ దూస శంకర్, కందికంటి అనూష ప్రవీణ్, మహిళా సంఘం వివో వరమ్మ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
