- అటవీ శాఖ వసూళ్లపై దృష్టి..పర్యాటకుల భద్రతపై అధికారుల నిర్లక్ష్యం..
- అనంతగిరి అడవిలో మృతదేహం..నిఘా వ్యవస్థ ఎక్కడ?
- అనంతగిరిపై టూరిజం పేరుతో వసూళ్లు పర్వం, పోలీస్ భద్రత లోపం..
- అడవిలో రెండు రోజుల క్రితం మృతదేహం కలకలం..
వికారాబాద్ జిల్లాకే తలవొంపు తెచ్చే విధంగా అనంతగిరి(Ananthagiri ) పర్యాటక కేంద్రంపై ఇప్పుడు పర్యాటకుల భద్రత, పార్కింగ్ రుసుములు, పర్యవేక్షణ, పోలీసుల వ్యవహారశైలిపై స్థానిక ప్రజల నుండి పలు అనుమా నాలు తలెత్తుతున్నాయి. అంతగిరి టూరిజం అభివృద్ధి పేరుతో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాల్సిన చోట పార్కింగ్ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిసు ్తన్నాయి.
అనంతగిరి దేవస్థానాన్ని దర్శించుకుని కొండపైకి వచ్చే పర్యాటకులు, యూ, పాయింట్, సమీపంలో వాహనం నిలిపితే గంటసేపైనా రూ.100 వసూలు చేస్తున్నారని, అనంతరం టూరి జం పరిధిలోని నందిఘాట్ ప్రాంతంలో మరో రూ.100 చెల్లిం చాల్సి వస్తోందని పలువురు పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఒకే వాహనానికి రెండు ప్రాంతాల్లో పార్కింగ్ రుసుము ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు సంబంధిత శాఖ అధికా రులు, నుంచి సరైన సమాధానం లభించలేదని, అధికారుల తీరు పై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పక్కన వాహనాలు నిలిపినప్పుడు జరిమానాలు విధించడం, ప్రశ్నించిన వారితో పోలీసులు కఠినంగా వ్యవహరి స్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కుటుంబాలతో, స్నేహితులతో సేదతీరేందుకు వచ్చిన పర్యాటకులను అనవసరం గా ప్రశ్నించడం, ఫొటోలు తీయడం, బెదిరింపులకు పాల్పడుతు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తల మొండెం శరీర భాగాలు వేరువేరుగా అనంతగిరిలో మృతదేహం : అనంతగిరి అడవి ప్రాంతంలో ఈ నెల 18న గుర్తుతెలియని వ్యక్తికి సంబంధించిన శరీర భాగాలు లభించడం మరింత కలకలం రేపింది. ఆ వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడు మృతికి కారణాలేమిటి మృతదేహం అక్కడికి ఎలా చేరింది అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో అనంతగిరి అడవి ప్రాంతంలో భద్రత, నిఘా వ్యవస్థపై స్థానికుల్లో ఆందోళన పెరిగింది. గతంలోనూ అనంతగిరి పరిసరా ల్లో ఆత్మహత్యలు, హత్యలు, గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.
పర్యాటక కేంద్రంగా వేలాది మంది వచ్చే ప్రాంతంలో కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలపై నిఘా, పర్యాటకుల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ ఎంతవరకు ఉందన్నది ఇప్పుడు అనంతగిరి అడవిలో(Ananthagiri Forest) ప్రశ్నార్థ కంగా మారింది. టూరిజం పేరుతో రుసుములు వసూలు చేయ డమే కాకుండా, పర్యాటకులకు భద్రత కల్పించడం కూడా అధికారుల బాధ్యత అని స్థానికులు పేర్కొంటున్నారు.

పార్కింగ్ రుసుములపై స్పష్టమైన రేట్ల బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రతి వసూలుకు తప్పనిసరిగా తేదీతో కూడిన రశీదు ఇవ్వాలని, ఒకే వాహనానికి రెండుసార్లు రుసుము వసూలు చేస్తున్నారనే ఆరో పణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని వారు కోరుతు న్నారు. అలాగే అనంతగిరి టూరిజం పరిధిలోని పోలీసుల వ్యవ హారశైలిపై కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించి పర్యాట కులతో మర్యాదగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అనంతగిరిని పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దాలంటే వసూళ్ల కంటే ముందు భద్రత, నిఘా, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన మృత దేహం ఘటనతోనైనా టూరిజం, అటవీ, పోలీసు శాఖలు సమన్వ యంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యాటకుల రాకపోకలను పర్యవేక్షించే పటిష్ట వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
