Homeఆదిలాబాద్MLA | కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

MLA | కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

  • ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి కళ్యాణ లక్ష్మి షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. బెల్లంపల్లి మండలం, బెల్లంపల్లి మున్సిపాలిటీ, నెన్నెల మండలం, కాసిపేట మండలం, తాండూర్ మండలాలకు చెందిన మొత్తం 141 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున చెక్కులు అందజేశారు.

మొత్తం పంపిణీ చేసిన నిధులు సుమారు రూ.1,41,16,356 (ఒక కోటి నలభై ఒక లక్షల పదహారు వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు). ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ….

- Advertisement -
MLA Gaddam Vinod Distributes Kalyana Lakshmi Shaadi Mubarak Cheques

ఆడపిల్లల వివాహాల సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాల లబ్ధి అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో తోడ్పడుతుందని, సమాజంలో ఆడపిల్లల పట్ల గౌరవం పెరగడంలో కూడా ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత పాటిస్తూ నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మార్వో కృష్ణ బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ధావ స్వాతి రమేష్ బాబు గారు, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News