Homeహైదరాబాద్‌MLC Election Campaign | ఆశీర్వదించి.. వీర తిలకం దిద్ది

MLC Election Campaign | ఆశీర్వదించి.. వీర తిలకం దిద్ది

  • తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
  • జెండా ఊపి ప్రచార వాహనాలు ప్రారంభించి పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో తలపడుతున్న తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) ప్రారంభించింది. బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆశీర్వదించి.. వీర తిలకం దిద్ది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆశీర్వచనం అందజేశారు.

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, హైదారబాద్ – మహబూబ్ నగర్ – రంగారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరుకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సహా మహిళా నాయకులు వీర తిలకం దిద్దారు. అనంతరం పార్టీ ప్రచార వాహనాలను కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్సీలుగా తిరిగి రావాలని ఆశీర్వదించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News