మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తాలో గల మెకానిక్ లూబ్రికేంట్స్ షాప్ పై దీపావళి క్రాకర్స్ మినుగురులు పడి ఆదివారం రాత్రి మంటలు వ్యాపించాయి(Fire Accident). మంటలు ఎగిసిన ప్రాంతం చుట్టూ బైక్ మెకానిక్ షాపులు, టైర్ పంచరింగ్ షాపులు ఉన్నాయి. రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
లూబ్రికెంట్స్ షాప్ పై మంటలు ఎగిసిపడుతున్న సమాచారం అందుకొని ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో కంట చౌరస్తా లోని బైక్ మెకానిక్ షాపుల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా కాల్చిన క్రాకర్స్ మిరుగులు వల్ల షాప్ కు నిప్పంటుకోవడం పట్టణంలో కలకలం రేపింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
